ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీకి విశ్వకర్మ అవార్డులు

ABN , First Publish Date - 2021-03-07T06:12:28+05:30 IST

కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌(సీఐడీసీ).. ఈ ఏడాదికి గాను విశ్వకర్మ అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన సోమ శ్రీనివాస్‌ రెడ్డి ఇంజినీర్స్‌ అండ్‌ కాంట్రాక్టర్స్‌(ఎస్‌ఎ్‌సఆర్‌ఈసీ)కు రెండు కేటగిరీల్లో అవార్డులు లభించాయి

ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీకి విశ్వకర్మ అవార్డులు

హైదరాబాద్‌: కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌(సీఐడీసీ).. ఈ ఏడాదికి గాను విశ్వకర్మ అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన సోమ శ్రీనివాస్‌ రెడ్డి ఇంజినీర్స్‌ అండ్‌ కాంట్రాక్టర్స్‌(ఎస్‌ఎ్‌సఆర్‌ఈసీ)కు రెండు కేటగిరీల్లో అవార్డులు లభించాయి. బెస్ట్‌ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్‌ కంపెనీల(రూ.100 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌) విభాగంలో ఒకటి, కరోనా వారియర్స్‌- ఆర్గనైజేషన్స్‌ కేటగిరీలో మరో అవార్డు లభించిందని ఎస్‌ఎ్‌సఆర్‌ఈసీ తెలిపింది. అంతేకాదు, కంపెనీ ప్రతినిధులైన సామ రవి కిరణ్‌ రెడ్డి, ఆర్‌ ఆనంద కిశోర్‌కు కరోనా వారియర్స్‌ - వ్యక్తిగత కేటగిరీల్లో అవార్డులు లభించాయంది. ఈనెల 7న ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్‌ హోటల్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని ఎస్‌ఎ్‌సఆర్‌ఈసీ వెల్లడించింది. 

Updated Date - 2021-03-07T06:12:28+05:30 IST