Apr 11 2021 @ 00:38AM

విఘ్నేశ్‌తో విషు బ్రేక్‌!

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఒకరినొకరు విడిచి ఉండలేరు. ఇద్దరూ జంట పక్షుల్లా విహరిస్తుంటారు. ఇప్పుడు నయన్‌, విష్నేశ్‌ తమ బిజీ షెడ్యూల్‌ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. మలయాళ కొత్త సంవత్సరం ‘విషు’ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ జంట కేరళలో వాలిపోయింది. కొచ్చి విమానాశ్రయంలో వారిద్దరూ దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. విఘ్నేష్‌, నయనతార కుటుంబ సభ్యులతో కలసి పండగను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు. ఆ తర్వాత  రజనీకాంత్‌ ‘అణ్ణాత్తే’, సేతుపతి ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’ చిత్రాల షూటింగ్‌లో నయనతార పాల్గొంటారు.