దేవాలయాలపై దాడులు సహించం: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-09-17T16:14:42+05:30 IST

హిందూ దేవాల యాలను, విగ్రహాలను ధ్వంసం చేసినా.. రథాలను తగుల బెట్టినా..

దేవాలయాలపై దాడులు సహించం: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డి

ఏలూరు(ఆంధ్రజ్యోతి): హిందూ దేవాల యాలను, విగ్రహాలను ధ్వంసం చేసినా.. రథాలను తగుల బెట్టినా బీజేపీ చూస్తూ ఉరుకోదని, హిందువుల పక్షాన  పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డి హెచ్చరించారు. ఏలూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 90 శాతం హిందువుల మనోభావాలను భంగపరుస్తుంటే చూస్తూ ఊరు కోమన్నారు. విద్యుత్‌ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పీకలపై కత్తి పెట్టిందని విమర్శించారు. సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.


ఈ సంస్కరణల్లో విద్యుత్‌ మీటర్లు బిగించాలని ఎక్కడా చెప్పలేదన్నారు. విద్యుత్‌ మీటర్లు ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయమన్నారు. ఏ రాష్ట్రంలోను విద్యుత్‌ మీటర్లు లేవని, ఇక్కడ పెడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వ స్వప్ర యోజనాలు ఏవో ఉండి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు. రోజూ డబ్బులు పంచుడుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు.  సమావేశంలో ఏలూరు పార్ల మెంటు జిల్లా అధ్యక్షుడు కొరళ్ళ సుధాకరకృష్ణ, అంబికాకృష్ణ, శీర్ల భాస్కర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-17T16:14:42+05:30 IST