విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: విష్ణువర్దన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-07-09T21:03:16+05:30 IST

విజయవాడ: రాష్ట్ర బీజేపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత ఎస్.విష్ణువర్దన్ రెడ్డి పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: విష్ణువర్దన్‌రెడ్డి

విజయవాడ: రాష్ట్ర బీజేపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత ఎస్.విష్ణువర్దన్ రెడ్డి పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీపై ఇంతకంటే ఎగిరెగిరి పడిన ప్రాంతీయ పార్టీలను దేశంలో చాలానే చూసిందన్న విషయాన్ని వైసీపీ గుర్తు పెట్టుకోంటే మంచిదన్నారు. వైసీపీ వైఫల్యాలను.. బీజేపీ ప్రజల ముందుకు తీసుకెళ్లిందని విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2020-07-09T21:03:16+05:30 IST