రైతు ఆదాయం పెంచేలా మరిన్ని పరిశోధనలు

ABN , First Publish Date - 2021-01-27T06:18:23+05:30 IST

మూల విత్తనోత్పత్తి ద్వారా వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించి, రైతుకు ఆదాయాన్ని పెంచేలా శాస్త్రవేత్తలు మరిన్ని నూతన పరిశోధనలు సాగించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ వీసీ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

రైతు ఆదాయం పెంచేలా మరిన్ని పరిశోధనలు

 అగ్రి వర్సిటీ వీసీ

అమరావతి, జనవరి26 : మూల విత్తనోత్పత్తి ద్వారా వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించి, రైతుకు ఆదాయాన్ని పెంచేలా శాస్త్రవేత్తలు మరిన్ని నూతన పరిశోధనలు సాగించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ వీసీ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నాగరాజు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్క రించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, పశుసంవర్ధక, మత్స్యశాఖ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. 

Updated Date - 2021-01-27T06:18:23+05:30 IST