Jul 22 2021 @ 02:25AM

షూటింగులో విశాల్‌కు గాయం

చెన్నై, జూలై 21 (ఆంధ్రజ్యోతి): హీరో విశాల్‌, తు.పా శరవణన్‌ కాంబినేషన్‌లో నాట్‌ ఏ కామన్‌మెన్‌ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు తర్వాత ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభించారు. ఇటీవల ఓ ఫైట్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, ఓ ఫైటర్‌ విసిరిన బాటిల్‌ విశాల్‌ వీపు భాగానికి బలంగా తగిలింది. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స తర్వాత విశాల్‌ తిరిగి షూటింగులో పాల్గొన్నారు. తాజాగా మరోమారు విశాల్‌ గాయపడ్డారు. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఆయన ఓ గోడను ఢీకొని కింద పడిపోయాడు. దీంతో విశాల్‌ వెన్నుకు గాయమైనట్టు సమాచారం. నొప్పి అధికంగా ఉండటంతో వైద్యులు ఫిజియోథెరపీ చేస్తున్నారు. దీనికి సంబంఽధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.