Abn logo
Oct 28 2020 @ 20:06PM

స్పీడుమీదున్న విశాల్‌...

Kaakateeya

హీరో విశాల్‌ స్పీడుని కరోనా కూడా ఆపలేకపోతుంది. కోవిడ్‌ ప్రభావంతో దాదాపు ఆరేడు నెలలు కామ్‌గా ఉన్న విశాల్‌ ఇప్పుడు సినిమాల విషయంలో స్పీడు పెంచేశాడు. రీసెంట్‌గా స్టార్ట్‌ చేసిన తన కొత్త సినిమాలో ఓ పాట కూడా అప్పుడే పూర్తయ్యింది. వివరాల్లోకెళ్తే...తమిళ హీరోలు విశాల్, ఆర్య ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ  సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా, ఆర్య విలన్ నటిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్‌గానే హైదరాబాద్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసుకుంది. షూటింగ్‌లో భాగంగా సినిమా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేశారు. ఈ పాట కోసం మినీ ఇండియాను తలపించేలా ఓ భారీ సెట్‌ వేశారట. ఆ సెట్‌లోనే పాటను పూర్తి చేశామని విశాల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. బృందగోపాల్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో టిక్ టాక్ స్టార్, `గద్దలకొండ గణేష్` సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తుంది. 



Advertisement
Advertisement