Abn logo
Sep 17 2020 @ 10:36AM

విశాల్ తండ్రి ఫిట్‌నెస్ చూస్తే `వావ్` అనాల్సిందే!

యుక్త వయసులో ఉన్నప్పుడు కండలు తిరిగిన శరీరం ఉన్నా.. వృద్ధాప్యంలోకి వచ్చాక వడలిపోవడం ఖాయం. అయితే హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డి మాత్రం 82 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో అబ్బురపరుస్తున్నారు. తనయుడు విశాల్‌తో పోటీపడుతూ కండలు పెంచుతున్నారు. ఈ వయసులో ఆయన ఫిట్‌నెస్ లెవెల్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 


జీకే రెడ్డి, విశాల్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ముందు నుంచి వ్యాయామం చేసే అలవాటున్న జీకే రెడ్డి త్వరగానే కోలుకున్నారు. కోలుకున్న తర్వాత వ్యాయామంపై మరింత దృష్టి సారించారు. ఇంట్లోనే ఉంటూ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.




Advertisement
Advertisement
Advertisement