Oct 19 2021 @ 00:58AM

‘లాఠీ’ పడుతున్న విశాల్‌

విశాల్‌ కొత్త చిత్రం టైటిల్‌ ‘లాఠీ’ని  గ్లింప్స్‌ ద్వారా సోమవారం  విడుదల చేశారు. ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించే ఈ చిత్రంతో ఏ.వినోద్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో భారీ ఎత్తున రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయనీ, ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల సేపు ఉండే యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌ కానుందనీ, దిలీప్‌ సుబ్బరాయన్‌ అద్భుతమైన  యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కంపోజ్‌ చేయనున్నారని నిర్మాతలు రమణ, నందా చెప్పారు. ఈ చిత్రంలో సునయన కథానాయికగా నటించనున్నారు. అన్ని భాషల్లోనూ ‘లాఠీ’ అనే టైటిల్‌ ఉంటుందని వారు చెప్పారు.