Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 04 Nov 2021 17:53:24 IST

సినిమా రివ్యూ: ఎనిమి

twitter-iconwatsapp-iconfb-icon

సినిమా రివ్యూ: ఎనిమి

విడుదల తేది: 04–11–2021

నటీనటులు: విశాల్‌, ఆర్య, మృణాలిని రవి, మమతా మోహన్‌దాస్‌, ప్రకాశ్‌రాజ్‌, తంబి రామయ్య తదితరులు. 

కెమెరా: ఆర్‌.డి.రాజశేఖర్‌

సంగీతం: తమన్‌ 

నేపథ్య సంగీతం: శ్యామ్‌. ఎస్‌

ఎడిటింగ్‌: రేమాండ్‌ డేరిక్‌ క్రాస్ట,  

నిర్మాత: ఎస్‌.వినోద్‌ కుమార్‌, 

రచన, దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌


సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు మాస్‌, యాక్షన్‌ హీరో విశాల్‌. తమిళంలో ఎంత క్రేజ్‌ ఉందో తెలుగులోనూ దాదాపుగా అంతే మార్కెట్‌ సంపాదించుకున్నారు. ‘వాడు–వీడు’ తర్వాత విశాల్‌–ఆర్య కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి ‘అరిమ నంబి’, ‘నోటా’ చిత్రాల ఫేం ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. రజనీకాంత్‌ ‘పెద్దన్న’తోపాటు బరిలో దిగిన ‘ఎనిమి’ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 


కథ:

సూర్య(విశాల్‌), రాజీవ్‌(ఆర్య) చిన్నప్పటి నుంచీ స్నేహితులు. వీరిద్దరి మఽధ్య పోటీ ఎక్కువ. భరత్‌–రాజీవ్‌ తండ్రి ప్రకాశ్‌రాజ్‌ వీరిద్దరినీ పోలీస్‌లు కావాలని కోరుకుంటారు. ఆకస్మాత్తుగా రాజీవ్‌ తండ్రి మరణించడంతో తన బిడ్డకు ఎలాంటి సమస్య ఎదురుకాకుండా సూర్య తండ్రి అతన్ని సింగపూర్‌ తీసుకెళ్లి ఓ సూపర్‌మార్కెట్‌ నడుపుకొంటూ, అక్కడున్న తెలుగు కమ్యూనిటీకి సహకరిస్తూ జీవితం సాగిస్తారు. రాజీవ్‌ దారి తప్పి క్రిమినల్‌గా మారతాడు. 25 ఏళ్ల తర్వాత సూర్య–రాజీవ్‌ ఎలా కలిశారు. వీరిద్దరి శత్రుత్వానికి కారణమేంటి? భరత్‌ను హత్య చేసిందెవరు? అన్నది మిగతా కథ. 


విశ్లేషణ:

సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా ప్రాంతంలో నివశించే తెలుగు కమ్యూనిటీలో సాగే కథ ఇది. ఇద్దరు స్నేహితులు శతృవులుగా మారితే ఏం జరిగింది? ఇగోలతో చేసిన పోరులో గెలుపు ఎవరిది అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. విశాల్‌ మాస్‌, యాక్షన్‌ ఇమేజ్‌కి తగ్గ కథ ఇది. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న ఆర్యకు కూడా తగిన కథే అనుకోవచ్చు. హీరోకి, విలన్‌కి మధ్య బలమైన సన్నివేశాలు లేకపోయినా నెగెటివ్‌ పాత్రలో ఆర్య వావ్‌ అనిపించారు. ఇక మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌ను పండించడంలో విశాల్‌ గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే కథ ప్రారంభమైనప్పటి నుంచి ఒక ఫ్లోలోకి తీసుకెళ్లడానికి దర్శకుడు తడబాటు పడ్డాడు. మొదటి 25 నిమిషాలు సో.. సోగా సాగింది. కొన్ని సన్నివేశాలు సాగదీత ప్రేక్షకుడికి కాస్త ఆసహనానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు రాజీవ్‌ ఎంట్రీ, అతను ప్లాన్‌ చేసిన మర్డర్‌ సన్నివేశాలతో కాస్త కథ స్పీడ్‌ అందుకొంది. సూర్య, రాజీవ్‌ కలుసుకున్నప్పటి నుంచి కథ మరింత ఆసక్తిగా సాగుతుంది. చిన్నతనంలో తన తండ్రి భరత్‌ ముందు తనకంటే మంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యను చూసి రాజీవ్‌ ఇగోతో క్రిమినల్‌గా మారాడు అన్న రీజన్‌ కాస్త సిల్లీగా అనిపించింది. అది అంత బలమైన కారణంగా కనిపించలేదు. సూర్య మైండ్‌ గేమ్‌, ఇంటెలిజెన్స్‌ సన్నివేశాలు కొన్ని చోట్ల ఆకట్టుకున్నాయి. అక్కడక్కడా తేలిపోయాయి. మమతా మోహన్‌దాస్‌ తన భార్య అనే విషయాన్ని అనుమానం రాకుండా జాగ్రత్త పడడంతో దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నా... ఆ పాత్రను అలా ముగించిన తీరు ఆసక్తికరంగా లేదు. మాళవిక అవినాశ్‌ (సింగపూర్‌ ప్రభుత్వ అధికారి) మర్డర్‌ ప్లాన్‌తో ఆసక్తిగా మారిన కథ ఆ తర్వాత ఆ పాత్రను కనుమరుగు చేశారు. ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న పోలీస్‌ ఊసు సినిమా చివరి వరకూ ఎక్కడా రాలేదు. 15 మంది పిల్లల్ని బెదిరించే సన్నివేశం, క్లైమాక్స్‌ పోరాటాలు సహనానికి పరీక్షగా మారింది. మమతా మోహన్‌దాస్‌ మర్డర్‌ వెనుకున్న సరైన కారణాన్ని ప్రొపర్‌గా చెప్పికుండా తేల్చేసినట్లు అనిపించింది. ఇక నటన, టెక్నికల్‌ విషయాలకు వస్తే, విశాల్‌, ఆర్యల నటన సినిమాకు బలం. మమతా మోహన్‌దాస్‌, మృణాలిని రవి పాత్రలు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి. గుర్తుంచుకునే పాటలేమీ లేవు. నేపథ్య సంగీతం బావుంది. మిగతా పాత్రలు ఫర్వాలేదనిపించాయి. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు  బావున్నాయి. 


ట్యాగ్‌లైన్‌: ‘ఎనిమి’ వీలైతే చూడొచ్చు. Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement