Sep 21 2021 @ 19:01PM

Enemy: డబ్బింగ్‌కు సిద్ధమైన విశాల్‌

యాక్షన్‌ హీరో విశాల్‌, ఆర్య కీలక పాత్రధారులుగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎనిమి’.  మిని  స్టూడియోస్‌ బ్యానర్‌పై ఎస్‌ వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాల్లో ఉంది. హీరో విశాల్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పేందుకు రెడీ అయ్యారు. గద్దలకొండ గణేష్‌ ఫేమ్‌ మృణాలిని రవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ప్రకాష్‌ రాజ్‌, మమత మోహన్‌ దాస్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు.