Oct 24 2021 @ 04:08AM

మిత్రులే బరిలో ప్రత్యర్థులు

విశాల్‌, ఆర్య బయట ఆ ఇద్దరూ మిత్రులు.. బరిలోకి దిగితే మాత్రం శత్రువులు. ‘వాడు వీడు’ చిత్రం తర్వాత ఇద్దరూ కలసి నటిస్తున్న చిత్రం ‘ఎనిమీ’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబరు 4న విడుదలవుతోంది. శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. రొమాన్స్‌, యాక్షన్‌, ఎమోషన్‌ను చూపించిన ఈ బ్లాస్టర్‌ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌ కథానాయికలు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.