May 6 2021 @ 17:33PM

విశాల్ 31 ప్రారంభం

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 31వ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయింది. ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ మేకర్ టి.పి. శర్వానన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటిస్తుండగా యువన్‌ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. విశాల్ ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'ఎనిమి' సినిమా వహిస్తుండగా ఆర్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. ఇక మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించాల్సిన 'తుప్పరివాలన్ -2' క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆగిపోయింది. దాంతో విశాల్ 31వ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి.. ఆగస్టులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.