విశాఖ మన్యం ప్రజలకు తప్పని డోలి కష్టాలు

ABN , First Publish Date - 2021-08-04T20:01:27+05:30 IST

ఏజెన్సీలో ఆదివాసీలకు డోలి మోత కష్టాలు తప్పడంలేదు. తోకపాడు గ్రామంలో కూసంగి చంద్రమ్మకు పురిటినొప్పులు వచ్చాయి.

విశాఖ మన్యం ప్రజలకు తప్పని డోలి కష్టాలు

విశాఖ: ఏజెన్సీలో ఆదివాసీలకు డోలి మోత కష్టాలు తప్పడంలేదు. తోకపాడు గ్రామంలో కూసంగి చంద్రమ్మకు పురిటినొప్పులు వచ్చాయి. రోడ్డుమార్గం లేక కొండలు, వాగులు దాటి డోలిపై ఆమెను కుటుంబసభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మోసుకొచ్చారు. చంద్రమ్మ నరకయాతన అనుభవించాల్సి పరిస్థితి ఏర్పడింది. తోకపాడు నుంచి కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు ఎటువంటి మార్గం లేదు. కేవలం కాలిబాట మాత్రమే ఉంది. దీంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన గర్భిణీ డోలిపై మోసుకుంటూ కొండ మార్గంలో ప్రయాణించి, తోకపాడు వాగు అతి కష్టంపై దాటించి కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వచ్చారు. వైద్యులు అక్కడ నుంచి అంబులెన్స్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. శివారు గిరిజన గ్రామాలకు ఇప్పటికైనా ప్రభుత్వం రహదారులు నిర్మించి, గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని ప్రాంత ఆదివాసుల విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-08-04T20:01:27+05:30 IST