Abn logo
Jun 25 2021 @ 12:18PM

విశాఖ: భిక్షాటన చేస్తున్న నిరుద్యోగులు

విశాఖ: సాగర తీరంలో నిరుద్యోగులు భిక్షాటన చేశారు. జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కారణంగా లక్షలాదిమంది నిరుద్యోగులకు భిక్షాటన తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి ఖాళీలతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పొట్ట కొట్టొద్దని.. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు.


జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లక్షా 83వేల ఖాళీలు ఉన్నాయని ప్రకటించిందని, కానీ జాబ్ క్యాలెండర్‌లో వాటి ప్రసక్తే లేదని తీవ్ర స్థాయిలో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.