Abn logo
Aug 2 2021 @ 21:36PM

విశాఖ ఉక్కుపై మళ్లీ అదే మాట

విశాఖ: స్టీల్ ప్లాంట్‌పై పాత వైఖరినే కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయటం ఖాయమని కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ వెల్లడించారు. ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని పున:పరీశీలించేదిలేదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. 100 శాతం పెట్టుబడుల వాటాను కేంద్రం ఉపసంహరించుకుంటుందని లోక్‌సభలో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భగవత్ రావు కరాడ్ సమాధానం చెప్పారు.