మాట్లాడుతున్న అనూప్‌కుమార్ శతపతి
డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శతపతి
ఆమదాలవలస, మే 23: పలాస-విశాఖ మధ్య డీఎంయూ రైలును పునరుద్ధరించనున్నట్టు విశాఖ డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శతపతి తెలిపారు. సోమవారం శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస రైల్వేస్టేషన్)లో ఫుట్‌వే బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నెలాఖరులోగా ఫుట్‌వే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. పూండి, శ్రీకాకుళం రోడ్డులో ఫుట్‌వే బ్రిడ్జిలను స్టెయిన్ లెస్ స్టీలుతో నిర్మించినట్టు చెప్పారు. పొందూరు, శ్రీకాకుళం రోడ్డు సమీపంలో రెండు చోట్ల రూ.42 కోట్లతో ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఆమదాలవలస రైల్వే అంతర్గత రహదారిలో నీరు నిల్వఉండకుండా సాంకేతిక లోపాలను సరిదిద్దుతామని చెప్పారు. అనంతరం రైల్వే అధికారులతో కలిసి స్టేషన్‌లో పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌ఎం సాహూ పాల్గొన్నారు. కాగా ఆమదాలవలసలోని వంశధార ప్రాజెక్టు గెస్ట్‌హౌస్‌లో డీఆర్‌ఎంను స్పీకర్ తమ్మినేని సీతారాం కలిసి సమస్యలను వివరించారు. ఆమదాలవలస స్టేషన్‌లో సదుపాయాలు, సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రవిసుధాకర్, నాయకులు తమ్మినేని వెంకట చిరంజీవినాగ్, బి.రమేష్ కుమార్, జెజే మోహనరావు పాల్గొన్నారు.