నరకాన్ని తలపిస్తున్న విశాఖ కోవిడ్ ఆస్పత్రి!

ABN , First Publish Date - 2020-08-02T22:11:31+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని విమ్స్ ఆస్పత్రి నరకాన్ని తలపిస్తోంది.

నరకాన్ని తలపిస్తున్న విశాఖ కోవిడ్ ఆస్పత్రి!

విశాఖపట్నం : జిల్లాలోని విమ్స్ ఆస్పత్రి నరకాన్ని తలపిస్తోంది. కరోనా సోకిన బాధితులను వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు మంచంపై నుంచి కిందపడినా ఆస్పత్రి సిబ్బంది కనీసం పట్టించుకోలేదు. ‘నన్ను కాపాడండి.. కాపాడండి’ అని ఆ వృద్ధుడు అరుస్తూ చనిపోయాడంటూ ఓ కరోనా బాధితుడు సెల్ఫీ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆస్పత్రికి వచ్చి పరిశీలించాలని అప్పుడే ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయని యువకుడు ఆ వీడియోలో చెప్పాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2020-08-02T22:11:31+05:30 IST