Abn logo
Nov 24 2020 @ 10:35AM

జీపు బోల్తా...మహిళ మృతి

విశాఖపట్నం: నగరంలోని ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ జీపు అదుపుతప్పి బోల్తా పడటంతో  ఈ ప్రమాదం జరిగింది. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  క్షతగాత్రులంతా పెదబయలు మండలం గడుగుపల్లి  గ్రామస్తులుగా గుర్తించారు. వీరంతా ఒరిస్సాలోని కిందిపడ  దేవాలయానికి దర్శనానికి వెళుతుండగా ఈ  ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement
Advertisement