విశాఖ: పూర్ణ మార్కెట్ వేళలు కుదింపు

ABN , First Publish Date - 2020-07-12T21:41:44+05:30 IST

నగరంలో కరోనా ఉధృతి నేపథ్యంలో విశాఖలోని పూర్ణా హోల్ సేట్ మార్కెట్ సమయాన్ని కుదించారు.

విశాఖ: పూర్ణ మార్కెట్ వేళలు కుదింపు

విశాఖ: నగరంలో కరోనా ఉధృతి నేపథ్యంలో విశాఖలోని పూర్ణ హోల్ సేల్ మార్కెట్ సమయాన్ని కుదించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కుదిస్తూ హోల్ సేల్ వ్యాపారస్తులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ జైన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పూర్ణ మార్కెట్‌కు 50 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ఈ మార్కెట్ నుంచే నిత్యావసర, అన్ని రకాల వస్తువులు ఇటు ఉత్తరాంధ్ర, అటు రాజమండ్రి వరకు సరఫరా అవుతాయని చెప్పారు. 


అయితే ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో అందరూ స్వేచ్ఛగా తిరుతున్నారని, దీంతో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని సంపత్ కుమార్ జైన్ అన్నారు. ఈ వైరస్‌ను కంట్రోల్ చేయడం కోసం పూర్ణ మార్కెట్ వేళలను కుదించినట్లు చెప్పారు. అందరం కలిసి ఈ మేరకు స్వీయ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు తప్పకుండా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-07-12T21:41:44+05:30 IST