అయ్యన్న ఇంటి దగ్గర హై డ్రామా... ఏ క్షణంలోనైనా అరెస్ట్..!

ABN , First Publish Date - 2022-02-24T16:29:29+05:30 IST

నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటివద్ద టెన్షన్ నెలకొంది.

అయ్యన్న ఇంటి దగ్గర హై డ్రామా... ఏ క్షణంలోనైనా అరెస్ట్..!

విశాఖ జిల్లా: నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటివద్ద టెన్షన్ నెలకొంది. ఏ క్షణంలోనైనా అయ్యన్నను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. బుధవారం అయ్యన్న ఇంటికి పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు వచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకు 41-ఏ నోటీసులు అంటించి వెనుదిరిగారు. తర్వాత మళ్లీ అయ్యన్నను అరెస్టు చేసేందుకు వచ్చారు.


ఈనెల 18న పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు.... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అక్కడి వైసీపీ నాయకుడు రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపై పోలీసులు ఐపీసీ 153 (ఏ), 502 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు అయ్యన్న పాత్రుడు ఇంటివద్ద భారీగా మోహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. 


Updated Date - 2022-02-24T16:29:29+05:30 IST