విశాఖలో అదృశ్యం.. కోటబొమ్మాళిలో లభ్యం

ABN , First Publish Date - 2022-03-18T01:56:56+05:30 IST

విశాఖ జిల్లా కేజీహెచ్‌లో పసికందు కిడ్నాప్‌ ఉదంతం సంచలనం రేకెత్తించింది. కేజీహెచ్‌లో అదృశ్యమైన పసికందు..

విశాఖలో అదృశ్యం.. కోటబొమ్మాళిలో లభ్యం

విశాఖ: విశాఖ జిల్లా కేజీహెచ్‌లో పసికందు కిడ్నాప్‌ ఉదంతం సంచలనం రేకెత్తించింది. కేజీహెచ్‌లో అదృశ్యమైన పసికందు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో పోలీసులకు దొరికింది. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో ఓ పసికందు అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ముమ్మరం తనిఖీలు చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగి వద్ద ఓ కారులో పసికందును తరలిస్తూ.. రాజేష్‌కుమార్‌, లక్ష్మీప్రసన్న దంపతులు పట్టుబడ్డారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన మాదిన రాజేష్‌కుమార్‌, లక్ష్మీప్రసన్న దంపతులకు 15 ఏళ్లుగా సంతానం లేదు. దీంతో కుటుంబంలో కలహాలు రేగాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీప్రసన్న గర్భం దాల్చినట్టు ఈ దంపతులు ఇంటివద్ద తమ కుటుంబ సభ్యులను నమ్మించారు. కొద్దిరోజులు బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పి.. బయట కొంతకాలం గడిపారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రేవడిరౌతుల పాలెం గ్రామానికి చెందిన మచ్చి అప్పాయమ్మ ఈ నెల 13న కేజీహెచ్‌లో ఓ పసికందుకు జన్మనిచ్చింది. బుధవారం రాత్రి 7.45 గంటల సమయంలో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు నర్సుల వేషంలో ఆ పసికందును వైద్యుల వద్దకు తీసుకెళ్తామని చెప్పి అపహరించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-03-18T01:56:56+05:30 IST