Abn logo
Apr 16 2021 @ 17:46PM

విశాఖ: భారీగా గంజాయి స్వాధీనం

విశాఖ: జిల్లాలో గంజాయి నిల్వలపై పోలీసులు దాడి చేశారు. ముంచంగిపుట్టు మండలంలోని గుమ్మసిరగంపుట్టులో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. 2,100 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో సంబంధమున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యాన్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.