ప్రశ్నించడమే నేరమా ?

ABN , First Publish Date - 2020-05-18T11:19:23+05:30 IST

విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించడా న్ని నేరంగా పరిగణించడం దారుణమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ..

ప్రశ్నించడమే నేరమా ?

డాక్టర్‌ సుధాకర్‌ పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండించిన తులసిరెడ్డి, రెడ్యం 

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన దళిత సంఘాలు


వేంపల్లె, మే 17: విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించడా న్ని నేరంగా పరిగణించడం దారుణమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు.  బద్వేలులో టీడీపీ ఎస్సీ సెల్‌, మైదుకూరులో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. 


 వేంపల్లెలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పనిచేస్తున్న వైద్యులకు మాస్కులు అందలేని చెప్పినందుకు సస్పెండ్‌ చేయడమే కాకుండా ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. రాష్ట్రంలో అటవిక పా లన సాగుతోందని విమర్శించారు. 

 

బద్వేలు, మే17: వైద్యుడు సుధాకర్‌పై విశాఖ పోలీసులు విచక్షణా రహితంగా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్శించిన తీరు ను నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి దానం ఆధ్వర్యంలో నిరసన  చేపట్టారు. డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు చేతులు, కాళ్లు కట్టేసి ఈడ్చుకుంటూ లాఠీలతో కొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్‌ సుధాకర్‌పై పోలీసులు దాడి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని టీడీ పీ నియోజకవర్గ నేత రాజశేఖర్‌ ఖండించారు.


మైదుకూరు, మే 17: డాక్టర్‌ సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశా రు. పార్టీ పిలుపు మేరకు ఆదివారం సాయం త్రం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు అంబేడ్కర్‌ చిత్రపటం ఉంచి, డాక్టర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నోటికి నల్లవస్త్రం కట్టుకుని  నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో  టీడీపీ ఛైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగన్‌, నేతలు ఆర్‌ శ్రీనివాసులు, ఆకుల క్రిష్ణయ్య, మారుతి, గుండంరాజు సుబ్బయ్య,  శాంతినగర్‌ ప్రసాద్‌, ధనపాల యుగంధర్‌, రవి, మాచనూ రు సుబ్బరాయుడు మహిళా నాయకురాలు భారతీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-18T11:19:23+05:30 IST