విశాఖపట్నం: నగరంలోని సీతమ్మధార జంక్షన్ అల్లూరి సీతారామ రాజు విగ్రహం వద్ద సీపీఐ నిరసనకు దిగింది. జీవీఎంసీ చెత్త పన్నులు, ఆస్తి పన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు మాట్లాడుతూ జగన్ సర్కార్ ప్రజల ప్రభుత్వం కాదన్నారు. పన్నుల భారం వేయడం వేయడం అంటే.. ప్రజల వెన్నుపోటు పొడవడమే అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జీవీఎంసీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన విజయ సాయి రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పన్నుల భారం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయ సాయి రెడ్డి ఇప్పుడు స్పందించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి