వ్యాక్సినేషన్ తర్వాత ఆందోళన వద్దు: డాక్టర్ పీవీ సుధాకర్

ABN , First Publish Date - 2021-01-16T16:50:12+05:30 IST

విశాఖలో 32 కేంద్రాల్లో ఈరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు.

వ్యాక్సినేషన్ తర్వాత ఆందోళన వద్దు: డాక్టర్ పీవీ సుధాకర్

విశాఖపట్నం: విశాఖలో 32 కేంద్రాల్లో ఈరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని  ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో డాక్టర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్నామని... వ్యాక్సినేషన్ అయిన తర్వాత అరగంట పాటు అబజర్వేషన్‌లో ఉండాలని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్కు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డాక్టర్ సూచించారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఏవైనా చిన్న చిన్న అరోగ్య సమస్యలు వచ్చినా, భయపడవలసిన అవసరం లేదన్నారు. జ్వరము, కండరాల నొప్పులు లాంటివి రావచ్చని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇవన్నీ 24 గంటలలోపు తగ్గిపోతాయని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రత్యేకంగా ఆహారం నిబంధనలు ఏమీ లేవని డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-16T16:50:12+05:30 IST