విశాఖపట్నం: నగరంలోని మునగపాక మండలం గంటవానిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. గుర్రాల బెన్నయ్య(66) అనే రైతు గత రాత్రి పశువుల పాకలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో పాకలో నిద్రిస్తున్న బెన్నయ్య మంటల్లో పడి సజీవదహనం అయ్యాడు. పశువుల పాక పూర్తిగా దగ్ధం అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.