విశాఖపట్నం: విశాఖలోని నక్కపల్లి మండలం బుచ్చిరాజు పేటలో విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూముల సమీకరణకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. పీసీపీఐఆర్‌లో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు 3,899 ఎకరాల భూమి కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. జాయింట్ కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. రాజయ్యపేట, చందనాడ తమ్మయ్యపేట, తుమ్మలపేట, బుచ్చిరాజు పేట గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.