విశాఖలో దారుణం

ABN , First Publish Date - 2020-10-22T15:47:37+05:30 IST

రెండు వర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. విశాఖలోని ఆనందపురం గిడిజాలలో చోటు చేసుకుంది.

విశాఖలో దారుణం

విశాఖపట్నం: రెండు వర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. విశాఖలోని ఆనందపురం గిడిజాలలో చోటు చేసుకుంది. రమణపై అనే వ్యక్తిపై మరో వర్గం దాడి చేసింది. రమణ కు తీవ్ర గాయాలు కావడంతో రోడ్డుప్రమాదంగా చిత్రీకరించిన వర్గం... వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన రమణ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. రమణ మృతితో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2020-10-22T15:47:37+05:30 IST