Abn logo
Sep 29 2020 @ 07:32AM

నేడు మన్యం బంద్

విశాఖపట్నం: జీవో నెంబర్ 3 రిజర్వేషన్ చట్టబద్ధతకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయడం సహా పలు అంశాలపై డిమాండ్ చేస్తూ నేడు మన్యం బంద్‌కు గిరిజన సంఘం, జీవో నెంబర్ 3 సాధన కమిటీ పిలుపునిచ్చింది. 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు పార్లమెంట్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన స్పెషల్ డి.యస్సీ నోటీపీకేషషన్ విడుదల చేయాలని.. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలని పట్టుబట్టారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయి పునరావాసం కల్పించాలని డిమాండ్  చేస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. ఏజెన్సీలో అన్ని రోడ్లను ఆందోళనకారులు బ్లాక్ చేశారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు పాడేరు డిపోలోనే నిలిచిపోయాయి. 


Advertisement
Advertisement
Advertisement