గణపతి పండగపై ఆంక్షలు పెట్టడం తగదు: Srinivasananda

ABN , First Publish Date - 2021-09-08T17:34:03+05:30 IST

గణపతి పండగపై ఆంక్షలు పెట్టడం తగదని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.

గణపతి పండగపై ఆంక్షలు పెట్టడం తగదు: Srinivasananda

విశాఖపట్నం: గణపతి పండగపై ఆంక్షలు పెట్టడం తగదని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. బుధవారం వినాయక చవితిపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ సాధుపరిషత్ మౌన దీక్షకు దిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ... హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ వెళుతోందని మండిపడ్డారు. తన విధానాలు మార్చుకొని అధికారికంగా వినాయక చవితికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రంలోగా అనుమతులు ఇవ్వాలన్నారు. కరోనా మార్గదర్శకాలు పాటించి అందరూ పండగను ఘనంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. మౌనదీక్షలో హిందూ సంఘాల నేతలు, సాధువులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-08T17:34:03+05:30 IST