Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్రమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మధ్య ఆసక్తికర సంభాషణ

విశాఖ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తాళ్లపాలెం పంచాయతీ, బంగారమ్మ పాలెం రేషన్ డిపో పరిశీలనకు వెళ్లిన సమయంలో కేంద్రమంత్రి, ఎమ్మెల్యే మధ్య సంభాషణ జరిగింది. స్థానికులతో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు. అయితే మధ్యలో కలుగజేసుకున్న నిర్మలా సీతారామన్.. ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాలపై ప్రధాని మోదీ ఫోటో ఉందో లేదో చూడాలని ప్రజలకు సూచించారు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘అక్కడ ఆ అన్న.. ఇక్కడ ఈ అన్న.. ఇద్దరి ఫోటోలు ఉన్నాయని’ చెప్పారు. ‘ఏ అన్న ఫోటో పెట్టినా నాకేం అభ్యంతరం లేదు. మన ప్రధాని మోదీ ఫోటో ఉండాలి’ అని నిర్మల సూచించడం హాట్ టాఫిక్‌గా మారింది.

Advertisement
Advertisement