విశాఖ స్టీల్‌ప్లాంట్ వైసీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలి: పవన్‌ కల్యాణ్

ABN , First Publish Date - 2021-12-13T02:09:27+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్ వైసీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలి: పవన్‌ కల్యాణ్

విశాఖ స్టీల్‌ప్లాంట్ వైసీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలి: పవన్‌ కల్యాణ్

గుంటూరు, మంగళగిరి: దీక్షకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తుకు వస్తుందని, రేపు ఓటు వేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకురావాలని పవన్‌ అన్నారు. అభివృద్ధి కోసమే తప్ప పదవుల కోసం పాకులాడే పార్టీ తమది కాదని పవన్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నామని, వైసీపీ నేతలు తకు శత్రువులు కాదని, వారి విధానాలనే వ్యతిరేకిస్తున్నామని పవన్‌ అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపైనే ప్రశ్నిస్తున్నామని, పోరాడి తెచ్చుకున్న ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరిస్తారని పవన్‌ ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అనేది ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది పోరాటాలకు, త్యాగాలకు గుర్తు అని పవన్ కల్యాణ్‌ అన్నారు.


ప్లాంట్‌ కోసం ఎంతోమంది ప్రాణాలు, పదవులు త్యాగాలు చేశారని, ఏపీ రాజధానిగా అమరావతినే ఉండాలని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అమరావతినే రాజధాని అని మోదీ, అమిత్‌షా అన్నారని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వ్యతిరేకించలేదని పవన్ అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అంటున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పవద్దని పవన్ సూచించారు. ప్లాంట్‌ విషయంలో రాష్ట్రం స్పందించకుంటే కేంద్రం ఎందుకు పట్టించుకుంటుందని, బీజేపీ దగ్గర తన మాటకు గౌరవం ఉండొచ్చు కానీ.. 22 మంది ఎంపీల మాట కేంద్రానికి శాసనమని పవన్ అన్నారు. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు? అని వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌ సభల్లో నిరసన తెలపాలని పవన్ పేర్కొన్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డ్‌ పట్టుకునే దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా? అని పవన్ ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నవారిపై మాత్రం దాడులు చేస్తారని, జనసేనకు అధికారం ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యే ఏ స్థాయిలో పనిచేస్తారో చేసి చూపిస్తానని పవన్‌ అన్నారు. ప్లాంట్‌ కోసం వైసీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలని, ప్రజల నుంచి స్పందన లేకపోతే నాయకులు కూడా ఏమీ చేయలేరని, ఇది ఒక్కరి సమస్య కాదు.. రాష్ట్ర సమస్య.. అందరూ కలిసిరావాలని పవన్‌ అన్నారు.

Updated Date - 2021-12-13T02:09:27+05:30 IST