స్టీల్ ప్లాంట్ డైరెక్టర్‌ ఫైనాన్స్ అధికారిని అడ్డుకున్న ఆందోళనకారులు

ABN , First Publish Date - 2021-03-09T15:45:33+05:30 IST

స్టీల్ ప్లాంట్ లోపలకి వెళుతున్న డైరెక్టర్ ఫైనాన్స్ అధికారి కారును ఆందోళనకారులు అడ్డుకున్నారు.

స్టీల్ ప్లాంట్ డైరెక్టర్‌ ఫైనాన్స్ అధికారిని అడ్డుకున్న ఆందోళనకారులు

విశాఖ: స్టీల్ ప్లాంట్ లోపలకి వెళుతున్న డైరెక్టర్ ఫైనాన్స్ అధికారి కారును పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళనకారులు అడ్డుకున్నారు. ‘ఆధానీ, అంబానీ జీతగాడు...మోదీ పెద్ద మోసగాడు’ అంటూ నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ప్లాంట్‌లో ఉద్యోగులను ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకుంటూ.. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2021-03-09T15:45:33+05:30 IST