విశాఖ : సృష్టి కేసులో పోలీసులకు కొత్త చిక్కులు

ABN , First Publish Date - 2020-08-14T02:44:29+05:30 IST

విశాఖపట్నం : నగరంలోని యూనివర్సల్ సృష్టి కేసులో పోలీసులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయ్.

విశాఖ : సృష్టి కేసులో పోలీసులకు కొత్త చిక్కులు

విశాఖపట్నం : నగరంలోని యూనివర్సల్ సృష్టి కేసులో పోలీసులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయ్. ఆచూకీ తెలిసిన పసిపాపను కన్నవారికి అప్పగించాలా? లేదా.. కొన్నవారికి అప్పగించాలా? విషయంపై పోలీసులు సతమతమవుతున్నారు. పుట్టిన బిడ్డ చనిపోయిందంటూ విజయనగరానికి చెందిన గర్భిణీకి యూనివర్సల్ సృష్టి ఎండీ డాక్టర్ నమ్రత చెప్పారు. దీంతో ఆ పసికందును పద్మశ్రీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పద్మజ ద్వారా విశాఖకు చెందిన మహిళకు రూ.13 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు. తన బిడ్డను అప్పగించాలంటూ కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరోగసీ ద్వారా తనకు బిడ్డను అప్పగించారని పెంపుడు తల్లి చెబుతోంది. దర్యాప్తు పూర్తయ్యేవరకు పాపను ఐసీడీఎస్‌లో ఉంచాలని పోలీసులు నిర్ణయించారు.

Updated Date - 2020-08-14T02:44:29+05:30 IST