నిర్లక్ష్యంగా ఉండొద్దు

ABN , First Publish Date - 2020-09-30T10:30:16+05:30 IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యం గా ఉండొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా ..

నిర్లక్ష్యంగా ఉండొద్దు

జాగ్రత్తలతోనే కరోనా నుంచి రక్షణ

 బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

 విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు


విజయనగరం క్రైం, సెప్టెం బరు 29 : విధి నిర్వహణలో నిర్లక్ష్యం గా ఉండొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా ఉండొచ్చని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్‌ గౌండ్‌లో పోలీసు అధికారులు, సిబ్బందికి కరోనాపై నిర్వహించిన అవగాహన సదస్సులో డీఐజీ పాల్గొని మాట్లాడారు. కరోనా నియంత్రణ కు జిల్లాలో పోలీసు సిబ్బంది ఎంతో శ్రమించి... రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు.


అయినా విధి నిర్వహణలో 660 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారన్నారు. మరికొంత మంది ఈ వైరస్‌ను జయించలేకపో యారని, వారి కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సదస్సులో ఎస్పీ బి.రాజకుమారి, డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, వెంకటప్పారావు, శేషాద్రి, సీఐలు మురళి, మంగవేణి, ఆర్‌ఐలు రమణమూర్తి, చిరంజీవిరావు, ఈశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T10:30:16+05:30 IST