విశాఖ: ఆర్కే బీచ్ దగ్గర సముద్రం ముందుకొచ్చింది. సముద్రపు అలల తాకిడికి భూమి బీటలువారింది. ఆర్కే బీచ్ దగ్గర అరకిలోమీటర్‌కు పైగా భూమి కోతకు గురైంది. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడివరకు భూమి కోతకు గురైంది. చిల్డ్రన్స్ పార్క్‌లో అడుగు మేర భూమి కుంగింది. అలాగే పార్క్ సమీపంలో పది అడుగుల మేర భూమి కుంగింది. చిల్డ్రన్స్ పార్క్‌లో భూమి కుంగడంతో ప్రహారీగోడ కూలింది. దీంతో అటువైపు రాకపోకలను జీవీఎంసీ అధికారులు, పోలీసులు నిలిపివేశారు.