Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ బెదిరింపులు

విశాఖ: ఏపీలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ నేతల బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖ జిల్లా, రావికమతం మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలను వైసీపీ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపించారు. రావికమతం మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు గానూ వైసీపీ అభ్యర్థులు, టీడీపీ మద్ధతుదారులు చెరో 10 స్థానాలు గెలుపొందారు. టీడీపీ మద్దతుదారులు 10 మంది ఎంటీసీలు విజయనగరంలో ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వైసీపీ నేతలు కార్లతో వెంబడించారు. రాడ్లతో బెదిరించారు. అంతకుముందు వారిని పోలీసులతో బెదిరించే ప్రయత్నం చేశారు. ప్రాణాలతో బయటపడతామా లేదా? అన్న భయంతో వణికిపోయామని మహిళా ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాలను తాము ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో నిలబడాలంటే భయపడేలా చేశారన్నారు

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement