Abn logo
Jul 1 2020 @ 02:38AM

విశాఖలో మళ్లీ లీక్‌

సాయినార్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదం

వెలువడిన రసాయన గ్యాస్‌ ‘బెంజిమిడాజోల్‌’

ఓ రియాక్టర్‌ నుంచి మరో రియాక్టర్‌కు 

పంపుతుండగా పెద్దఎత్తున లీక్‌

షిఫ్ట్‌ ఇన్‌చార్జి, కెమిస్ట్‌ ఇద్దరూ మృతి

మరో నలుగురు సహాయకులకు తీవ్ర అస్వస్థత


విశాఖపట్నం, పరవాడ, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన మరిచిపోక ముం దే పరవాడ ఫార్మాసిటీలో సోమవారం అర్ధరాత్రి మరో ప్రమాదం జరిగింది. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో బెంజిమిడాజోల్‌ గ్యాస్‌(హెచ్‌2ఎస్‌) లీకైం ది. ఆ సమయంలో అక్కడ విఽధుల్లో ఉన్న షిఫ్ట్‌ ఇన్‌చా ర్జి రావి నరేంద్ర(36), కెమిస్ట్‌ మహంతి గౌరీశంకర్‌ (26) మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు లు, యాజమాన్యం తెలిపిన వివరా ల ప్రకారం,, కంపెనీలోని ప్రొడక్షన్‌ బ్లాకులో ఓ రియాక్టర్‌ నుంచి మరో రియాక్టర్‌కు బెంజిమిడాజోల్‌ను పం పుతుండగా వైపర్‌ నుంచి గ్యాస్‌ పెద్దఎత్తున లీకైంది. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన షి ఫ్ట్‌ ఇన్‌చార్జి రావి నరేంద్ర (తెనాలి), కెమిస్ట్‌ గౌరీశంకర్‌(పూసపాటిరేగ) అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ స్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో నలుగురు సి బ్బంది అక్కడకు వెళ్లారు. వారు కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఎల్‌వీ చంద్రశేఖర్‌(పరవాడ), పి.ఆనంద్‌బాబు (అనకాపల్లి), ట్రైనీ కెమిస్ట్‌ డి.జానకీరాం(ఎన్‌ఏడీ), కెమిస్ట్‌ ఎం.సూర్యనారాయణ(అగనంపూడి)గా గుర్తించారు. ఆస్పత్రికి తరలించారు. వీరిలో చంద్రశేఖర్‌ పరిస్థితి విషమంగా ఉంది. 


భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే..

కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇదే కంపెనీలో 2015 సెప్టెంబరు 28న రి యాక్టర్‌ మ్యాన్‌హోల్‌ ఓపెన్‌ కావడంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. అయినా యాజమాన్యం అదే నిర్ల క్ష్యం కొనసాగించడంతో ఇప్పడు మరో ఇద్దరు ప్రా ణా లు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు జిల్లా కలెక్టర్‌ వినయచంద్‌, పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్ర మాదంపై విచారణకు నలుగురు అధికారులతో కమిటీ వేశామని.. ని వేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకోవైపు.. వివిధ పార్టీల నాయకులు కంపెనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను సై తం అనుమతించలేదు.


బండారు అరెస్టు

ప్రమాద వార్త తెలియగానే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఘటనా స్థలానికి వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే కంపెనీలో ప్రమా దం జరిగితే.. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, బాధితులకు పరిహారం అందించామన్నారు. సీఎం జగన్‌  పోలీసు రాజ్యం నడుపుతున్నారని ఆరోపించారు. కొద్దిసేపటి తరువాత బండారును అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించి పోలీసులు సాయంత్రం 6 వరకు నగరమం తా తిప్పి హార్బర్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పెం దుర్తి ఎమ్మెల్యే అదీ్‌పరాజును మాత్రం అనుమతించా రు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడడంతో వెనుక వైపు నుంచి పంపారు.


జగన్‌ ఆరా: సాయినార్‌ ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా తీశారు. వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.


మొగ్గలోనే మోడువారింది

భర్తకు మంచి ఉద్యో గం.. సంబరంగా కొత్తకాపురంలోకి అడుగుపెట్టిన ఆ నవ వధువు ఆశలన్నీ కుప్పకూలిపోయాయి. గౌరీశంకర్‌తో వెంకటలక్ష్మికి ఏప్రిల్‌లో వివాహం జరిగింది. తల్లి కూడా కాబోతోంది. ఆ ఆనందంలో ఉండగానే పిడుగులాంటి వార్త చెవిన పడింది. తట్టుకోలేని స్థితిలో కుప్పకూలిపోయింది. ఎదిగిన కొడుకు చేతికి అందివచ్చాడని, జీవితం ఆనందంగా సాగుతుందని భావించిన అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


అవే చివరి మాటలు...

వెళ్లొస్తాను... అంటూ భార్యకు, కన్నా బైబై అం టూ నాలుగేళ్ల చిన్నారితో నరేంద్ర పలికిన పలుకులే ఆఖరి మాటలయ్యాయి. అమ్మా.. నాన్న కేమైందమ్మా... ఎందుకు లేవడం లేదంటూ ప్రశ్నించిన కు మార్తెను అక్కున చేర్చుకుని కన్నీరుమున్నీరుగా నరేంద్ర భార్య విజయలక్ష్మి రోదించడం చూపరుల మనసులను ద్రవింపజేసింది. పొట్టకూటి కోసం జిల్లాలు దాటి వచ్చిన తమపై విధి పగబట్టిందని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. నరేంద్ర స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామం. ఎమ్మెస్సీ చదివి ఫార్మాసూటికల్‌ కంపెనీలో కెమి్‌స్టగా చేరాడు. తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement