విశాఖ జిల్లా: నర్సీపట్నం టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ అయ్యన్న పాత్రుడు నిరసన కార్యక్రామానికి పిలుపు ఇచ్చారు. దీనికి అనుమతి లేదంటూ, ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు అయ్యన్న ఇంటికి చేరుకున్నారు.