Advertisement
Advertisement
Abn logo
Advertisement

నర్సీపట్నం వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం

విశాఖ: నర్సీపట్నం మున్సిపాలిటీలోని 28వ వార్డు సచివాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకానికి జరిగిన అవమాన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 15న స్థానిక వైసీపీ నేతలు, సచివాలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతీయ జెండాను పోలిన విధంగా తయారు చేయించిన కేకును నర్సీపట్నం ఛైర్ పర్సన్ ఆదిలక్ష్మి కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, సిబ్బంది ఒకరికొకరు కేక్ తినిపించుకున్న దృశ్యాలు బయటకు రావడంతో వారి నిర్వాకం ఆలస్యంగా వెలుగుచూసింది. 

Advertisement
Advertisement