వీసా అపాయింట్‌మెంట్ మరింత ఆలస్యం కావచ్చు.. అమెరికా ఎంబసీ ప్రకటన

ABN , First Publish Date - 2021-11-01T01:07:44+05:30 IST

కొన్ని రకాల వీసా కేటగిరీలకు సంబంధించి ఎంబసీలో అపాయింట్‌మెంట్ పొందేందుకు అధికసమయం వేచి చూడాల్సి రావచ్చని దేశరాజధానిలోని అమెరికా ఎంబసీ తాజాగా ప్రకటించింది.

వీసా అపాయింట్‌మెంట్ మరింత ఆలస్యం కావచ్చు.. అమెరికా ఎంబసీ ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రకాల వీసా కేటగిరీలకు సంబంధించి ఎంబసీలో అపాయింట్‌మెంట్ పొందేందుకు అధికసమయం వేచి చూడాల్సి రావచ్చని దేశరాజధానిలోని అమెరికా ఎంబసీ తాజాగా ప్రకటించింది. కరోనా అంతరాయం తరువాత.. ఇప్పుడిప్పుడే వీసాల జారీ వేగవంతం అవుతున్న తరుణంలో కొన్ని కేటగిరీల్లో అపాయింట్ పొందేందుకు ఆలస్యం అయ్యే అవకాశం స్పష్టం చేసింది. అమెరికా కొత్త కరోనా నిబంధనల ప్రకారం.. వీసా కలిగిన భారతీయులు అమెరికాలో ప్రవేశించే అవకాశం కలిగింది. ప్రస్తుతం భారత్‌లో వీసా ఉన్న వారు దాదాపు 3 మిలియన్ల మంది ఉన్నట్టు సమాచారం. ‘ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలకు మద్దతుగా అమెరికా ప్రయాణాలను ప్రోత్సహించడం మాకు ఎంతో ముఖ్యం. అయితే..వీసా కోసం అపాయింట్ కోరుతున్న వారు కాస్త వేచి చూడాల్సి రావచ్చు’ అని ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. 

Updated Date - 2021-11-01T01:07:44+05:30 IST