మౌత్‌వా్‌షల పుక్కిలింపుతో వైరస్‌ పరార్‌!

ABN , First Publish Date - 2020-08-12T06:43:16+05:30 IST

కరోనా ఇన్ఫెక్షన్‌ సోకినవారు మౌత్‌వా్‌షను కనీసం 30 సెకన్ల పాటు పుక్కిలిస్తే.. నోరు, గొంతు భాగాల్లో వైరల్‌ లోడ్‌ తగ్గుతుందని జర్మనీలోని రూర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు...

మౌత్‌వా్‌షల పుక్కిలింపుతో వైరస్‌ పరార్‌!

బెర్లిన్‌, ఆగస్టు 11 : కరోనా ఇన్ఫెక్షన్‌ సోకినవారు మౌత్‌వా్‌షను కనీసం 30 సెకన్ల పాటు పుక్కిలిస్తే.. నోరు, గొంతు భాగాల్లో వైరల్‌ లోడ్‌ తగ్గుతుందని జర్మనీలోని రూర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 8 రకాల మౌత్‌వా్‌షలతో పరిశోధనలు జరపగా, మూడు రకాలవి ప్రభావవంతంగా పనిచేసి నోటి కణజాలంలో వైరస్‌ కదలికలను తగ్గించాయని వెల్లడించారు. ప్రధానంగా కరోనా రోగులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వీటిని వాడటం ద్వారా వైరస్‌ నుంచి అదనపు రక్షణ పొందవచ్చని సూచించారు. కరోనా సోకిన వారి నోరు, గొంతు భాగాల్లో వైరస్‌ క్రియాశీలంగా కదలికలు సాగిస్తుంటుంది. వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే నీటితుంపరలు మాధ్యమంగా వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది. కరోనా సోకినవారు మౌత్‌వా్‌షను పుక్కిలిస్తే వైరల్‌ లోడ్‌ తగ్గి, ఎదుటివారికి తుంపరల ద్వారా వైరస్‌ సోకే ముప్పు తగ్గుతుంది. 


Updated Date - 2020-08-12T06:43:16+05:30 IST