103 మందికి వైరస్‌

ABN , First Publish Date - 2020-10-15T07:08:01+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 103 కేసులు నమోదయ్యాయి.

103 మందికి వైరస్‌

ఉమ్మడి పాలమూరులో కరోనాతో ముగ్గురు మృతి


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/ గద్వాలక్రైం/ నాగర్‌కర్నూల్‌/ వనపర్తి/ నారాయణపేట క్రైం, అక్టోబరు 14 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 103 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకరు, గద్వాల జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లాలో 30 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలో 14 మంది కరోనా బారిన పడ్డారు. జిల్లాలోని వివిధ మండలాల్లో 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. నవాబ్‌పేట మండలం ఎన్మనగండ్లలో మహిళ (63) కరోనాతో మృతి చెందారు. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం 11 కరోనా కేసులు నమోదయ్యాయి. గద్వాల పట్టణంలో ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, జిల్లాలోని వివిధ మండలాలలో ఆరుగురు కరోనా బారిన పడ్డారు. జిల్లా కేంద్రంలో కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న మహిళ (65), వ్యక్తి (55) మృతి చెందారు. 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 26, వనపర్తి జిల్లాలో 32, నారాయణపేట జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

Updated Date - 2020-10-15T07:08:01+05:30 IST