చల్లటి వాతావరణంలోనే వైరస్ విజృంభన..!

ABN , First Publish Date - 2020-04-09T19:22:34+05:30 IST

వైరస్‌లు వేడి వాతావరణంలో ఉండలేవా?

చల్లటి వాతావరణంలోనే వైరస్ విజృంభన..!

హైదరాబాద్: వైరస్‌లు వేడి వాతావరణంలో ఉండలేవా? డిసెంబర్ నుంచి మే వరకు ఈ వైరస్‌లు వ్యాప్తి చెందుతాయా? చల్లటి వాతావరణంలోనే విజృంభిస్తాయా? అంటే అవుననే పరిశోధకులు అంటున్నారు. వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న వాతావరణ పరిస్థితుల్ని అధ్యాయనం చేస్తే.. ఈ నిర్ణయానికే రావచ్చంటున్నారు.


కరోనా వైరస్‌లు మొత్తం ఏడు రకాలు ఉన్నాయి. వాటిలో నాలుగు సాధారణ శ్వాస సంబంధిత ఇబ్బందులను కలగజేస్తాయి. ఇవి సీజనల్‌గానే వ్యాప్తి చెందుతున్న విషయాన్ని పరిశోధకులు కనిపెట్టారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ కూడా సీజనల్‌గానే వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు. సాధారణంగా వ్యాప్తి చెందే నాలుగు రకాల కరోనా వైరస్ సోకిన కేసుల్లో పెద్దవాళ్లలో తొమ్మిది, పిల్లల్లో 20 శాతం వరకు మాత్రమే వైద్యుల చికిత్స అవసరం పడుతుంది. ఈ నాలుగు వైరస్‌లు ఎక్కువగా డిసెంబర్ నుంచి మే నెలల మధ్యనే వ్యాప్తి చెందుతున్నాయి. 

Updated Date - 2020-04-09T19:22:34+05:30 IST