పల్లెకు వైరస్‌

ABN , First Publish Date - 2021-05-18T06:25:59+05:30 IST

సెకెండ్‌వేవ్‌లో కరోనా వైరస్‌ పల్లెలనూ కమ్మేస్తోంది. జి ల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మహమ్మారి ప్రజలను వెంటాడుతోంది. కేసులు వీపరీతంగా పెరిగిపోయాయి.

పల్లెకు వైరస్‌

గ్రామాలను కమ్మేసిన కరోనా

జిల్లా ఆస్పత్రికి బాధితుల పరుగులు

బెడ్లు లేక నరకయాతన

గ్రామాల్లో కొవిడ్‌ కేంద్రాల 

ఏర్పాటుకు కేంద్రం ఆదేశం

ఏర్పాట్లు చేయకపోతే మరింత ఉధృతం

అనంతపురం వైద్యం, మే17

 సెకెండ్‌వేవ్‌లో కరోనా వైరస్‌ పల్లెలనూ కమ్మేస్తోంది. జి ల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మహమ్మారి ప్రజలను వెంటాడుతోంది. కేసులు వీపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి ఇం ట్లోనూ బాధితులు పెరిగిపోతున్నారు. స్థానికంగా చికిత్సలు లేక జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. జిల్లా సర్వజనాస్పత్రిలో సరైన వసతులు, బెడ్లు దొరక్క బాధితులు నరకం అనుభవిస్తున్నారు. సోమవారం జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీ కేంద్రం బాధితులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు సందడి సాగింది. బెడ్లు లేక బాధితులు అనేక కష్టాలు పడుతూ కనిపించారు. కుర్చీల్లో, నేలపైనే బాధితులకు వైద్య సిబ్బంది చికిత్సలు అందిస్తూ కనిపించారు. కొందరు పడకల కోసం పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. కొత్తగా దాతలు 50 పడకలు ఏర్పాటు చేయడంతో అక్కడికి తరలించి, ఆక్సిజన అందిస్తూ చికిత్సలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినా చాలామంది మంచాలు లేక అవస్థలు పడ్డారు. 

గ్రామాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటాన్ని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రా మంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిం ది. ఆ మేరకు ఏర్పాటు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచీ ఎక్కడికక్కడ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, బాధితులకు చికిత్సలు అందించి భరోసా కల్పించి ఉంటే జిల్లాలో ఈ పరిస్థితి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నా యి. ఆ దిశగా జిల్లా అధికారులు, పాలకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ప్రస్తుతం పల్లె జనం వైరస్‌ బారిన పడి విలవిల్లాడుతున్నారు. కేంద్రం ప్రతి గ్రామంలో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు చర్యలు చేపట్టకపోతే పల్లె ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లా యం త్రాంగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామంటోంది. ఏం చేస్తారో చూడాలి.



Updated Date - 2021-05-18T06:25:59+05:30 IST