30న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2020-09-24T08:19:14+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఈ నెల 30వ తేదీన పిఠాపురం కోర్టుల ప్రాంగణంలో వర్చువల్‌ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు 12వ

30న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

పిఠాపురం, సెప్టెంబరు 23: కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఈ నెల 30వ తేదీన పిఠాపురం కోర్టుల ప్రాంగణంలో వర్చువల్‌ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి ఎన్‌.సాల్మన్‌రాజు తెలిపారు. పిఠాపురంలో బుధవారం న్యాయవాదులకు ఈ లోక్‌అదాలత్‌ నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జూమ్‌యాప్‌ ద్వారా కక్షిదారులతో చర్చించి కేసులు పరిష్కరిస్తామని చెప్పారు.  కక్షిదారులు తమ న్యాయవాదుల ద్వారా అంగీకార పత్రాన్ని మెయిల్‌ ద్వారా పంపాలని సూచించారు. క్రిమినల్‌, సివిల్‌, ఎక్సైజ్‌, ఎంవీవోపీ, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కేసులను ఈ విధానంలో పరిష్కరిస్తామని వివరించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి గాయత్రిదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేశ్వరరెడ్డి, అదనపు జడ్జి దివ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T08:19:14+05:30 IST