ఆల్‌టైం రికార్డు..!

ABN , First Publish Date - 2022-07-06T05:41:49+05:30 IST

వర్జీనియా పొగాకు 75 ఏళ్ల చరిత్రలోనే రికార్డుస్థాయి ధరలు నమోదు చేసుకున్నాయి. ఈ ఏడాది ధరలు వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ఆశా జన కంగా ఉన్నాయి.

ఆల్‌టైం రికార్డు..!

పొగాకుకు మంచి ధరలు

గరిష్ట ధర రూ.231 , కనిష్టం రూ.120 

వర్జీనియా పొగాకు చరిత్రలోనే అత్యధికం


జంగారెడ్డిగూడెం, జూలై 5 : వర్జీనియా పొగాకు 75 ఏళ్ల చరిత్రలోనే రికార్డుస్థాయి ధరలు నమోదు చేసుకున్నాయి. ఈ ఏడాది ధరలు వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ఆశా జన కంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ లేని ధరలు ఈ ఏడాది ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో నమోదయ్యాయి. మంగళవారం కేజీ పొగాకు గరిష్టంగా రూ.231 నమోదవడంతో రాష్ట్రంలోనే ఆల్‌ టైం రికార్డును నమోదు చేసుకుంది. 2019లో కేజీ పొగాకు రూ.230 నమోదవగా ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉంది. మంగళవారం కేజీ పొగాకు రూ.231 నమో దవడంతో పాత రికార్డును బద్దలుకొట్టింది. జంగారెడ్డిగూడెం –1, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో కేజీ పొగాకు ధర రూ.230 నమోదు కాగా గోపాలపురం వేలం కేంద్రంలో కేజీ పొగాకు రూ.231 గరిష్టంగా నమోదైంది. అయితే 2019లో కేజీ పొగాకు రూ.230 ధర ఉన్నా సరాసరి ధరలు రూ.150 కంటే కిందే ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 81 రోజులపాటు వేలం జరపగా కేజీ పొగాకు సరాసరి రూ.180 కంటే ఎక్కువగా నమోదైంది. ఈ ఏడాది నాణ్యమైన పొగాకుతో పాటు లోగ్రేడ్‌ పొగాకు రూ.120 తక్కువగా నమోదు కాలేదు. దీంతో సరాసరి ధరలు రికార్డుస్థాయిలో నిలిచాయి. పెరిగిన ధరలతో పొగాకు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


Updated Date - 2022-07-06T05:41:49+05:30 IST