మాస్కులు తప్పనిసరి కాదన్నందుకు గవర్నర్‌పై కేసు

ABN , First Publish Date - 2022-02-03T02:21:42+05:30 IST

కరోనా విజృంబిస్తున్న తరుణంలో మాస్కులు తప్పనిసరి కాదు అంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఆయనపై కేసు నమోదైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వె

మాస్కులు తప్పనిసరి కాదన్నందుకు గవర్నర్‌పై కేసు

వర్జీనియా: కరోనా విజృంబిస్తున్న తరుణంలో మాస్కులు తప్పనిసరి కాదు అంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఆయనపై కేసు నమోదైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ విజృంభిస్తోంది. దీంతో లక్షలాది మంది ప్రజలు మహమ్మారి బారినపడుతున్నారు. ఈ క్రమంలోనే వర్జీనియా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లలో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి కాదని పేర్కొన్నారు. ‘మాస్కులు ధరించాలా? వద్దా? అనే విషయంలో తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉంది.  పిల్లలు మాస్కులు ధరించాలా వద్దా అనే విషయాన్ని వాళ్లే చూసుకుంటారు. పిల్లలకు ఏది మంచిదో వారికి తెలుసు’ అని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సివిల్ లిబరిటీస్ గ్రూపు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్‌పై కేసు నమోదు చేసింది. 




Updated Date - 2022-02-03T02:21:42+05:30 IST