Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోహిత్-కోహ్లీ ఓపెనింగ్‌పై.. వీరూ రియాక్షన్ ఇదీ !

ఇంటర్నెట్ డెస్క్: మొతేరాలో ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో క్రికెట్ అభిమానులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జోడి ఓపెనింగ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఈ ద్వయాన్ని వీరూ.. పెరుగు, జిలేబీ కాంబినేషన్‌తో పోల్చారు. హిట్‌మ్యాన్ రోహిత్, రన్‌మెషిన్ విరాట్ ఓపెనింగ్ రావడం చూసినప్పుడు నాకు ఇది 'డెడ్లీ కాంబినేషన్' అనిపించిందంటూ పెరుగు, జిలేబీ ఫొటోను వీరేంద్రుడు ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన రోహిత్, కోహ్లీ తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 94 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్(64; 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడితే.. విరాట్(80నాటౌట్; 54 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సులు) చివర వరకు క్రీజులో ఉండి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ ఇక ముందు కూడా రోహిత్‌తో కలిసి కచ్చితంగా ఓపెనర్‌గా వస్తానన్నాడు. అలాగే ఐపీఎల్‌లోనూ బెంగళూరు తరఫున ఓపెనింగ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కోహ్లీ గుర్తు చేశాడు.


Advertisement
Advertisement